(జూన్ 7న సంగీత దర్శకులు జె.వి.రాఘవులు వర్ధంతి)ప్రముఖ సంగీత దర్శకులు జె.వి.రాఘవులు పుట్టినతేదీ ఏ రోజో తెలియదు. కానీ, తాను పుట్టింది ఎందుకో అన్న అంశం మాత్రం రాఘవులుకు బాగా తెలుసు. బాల్యంలోనే ‘హరిశ్చంద్ర’ నాటకంలో లోహితాస్యునిగా నటించి రాగయుక్తంగా పాడి మెప్పించేవారు. నాటకాలన్నా, నటనన్నా ఎంతో ప్రీతి. దాంతో రాఘవులు అంతగా చదువుకోలేక పోయారు. పదోతరగతి దాకా చదివినా, పురాణాలపై మంచి పట్టు ఉండేది రాఘవులుకు. ఆయన గురువులు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, వేదుల సత్యనారాయణ శాస్త్రి…