Meerpet Murder Case : తెలంగాణను కుదిపేసిన మీర్‌పేట్ హత్య కేసును పోలీసులు పరిష్కరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గురుమూర్తిని అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న అతడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పలు కీలక విషయాలను వెల్లడించారు. సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ, భార్య వెంకట మాధవిని అత్యంత కిరాతకంగా హత్య చేసినప్పటికీ, నిందితుడు గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని అన్నారు. కేసు దర్యాప్తు లోతుగా సాగుతుండగా,…