ఏపీ హైకోర్టుపై ఇటీవల విమర్శలు చేసిన మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను చంద్రబాబు పక్షమో, జగన్ పక్షమో కాదని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు.. వివిధ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు విని, సమన్యాయం అందించేందుకు ప్రయత్నించాలని మాత్రమే తాను చెప్పానని జస్టిస్ చంద్రు పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు విషయం తన వ్యాఖ్యలను పలువురు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.…
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పై జస్టిస్ చంద్రు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేకంగా మాట్లాడితే.. ఎవరూ ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేరని కేసీఆర్ ను హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ తీరు విస్మయం కలిగించిందని వెల్లడించారు. సమ్మె ఎన్ని రోజులు చేస్తారో చూస్తానని కేసీఆర్.. కార్మికులను బెదిరించారని ఆగ్రహించారు. యూనియన్లతో కాకుండా ఉద్యోగులతోనే మాట్లాడతాననడం ఏంటి అని నిలదీశారు. కచ్చితంగా యూనియన్లతోనే మాట్లాడాలని పేర్కొన్నారు. జలహక్కులకు…