మైనర్ బాలికపై అత్యాచారం, హత్య చేసిన కేసులో నిందితుడికి మరణ శిక్షను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ సమర్థించింది. అత్యంత దారుణంగా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు పాశవికంగా హత్య చేయడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేరం క్రూరమైనదని..అమానవీయమని పేర్కొంది. శారీరకంగా, మానసికంగా వికలాంగురాలైన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం, హత్య చేసిన నిందితుడు మనోజ్ ప్రతాప్ సింగ్ కు రాజస్థాన్ హైకోర్ట్ విధించిన మరణశిక్షను సుప్రీం కోర్టు ధ్రువీకరించింది. న్యాయమూర్తులు…