Ravindranath Reddy: కడప జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ముఖ్య నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా “వెన్నుపోటు దినం”గా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని కారణంగా ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన తెలిపారు. జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలకు…