అమెరికాలోని శ్రీవారి భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమెరికాలో వున్న తెలుగు వారి కోసం ఈ నెల 18 వ తేదీ నుంచి జూలై 9తేది వరకు కళ్యాణోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 7 నగరాలలో కళ్యాణోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. నాటా ఆధ్వర్యంలో కళ్యాణోత్సవ కార్యక్రమాలకు భక్తులను ఉచితంగా అనుమతిస్తాం అనీ, భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారని భావిస్తున్నామన్నారు. కళ్యాణోత్సవ కార్యక్రమాలకు విగ్రహాలను తిరుమల…