యోగసాధన అంటే కేవలం వ్యాయామం కాదు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడే అద్భుత సాధనం యోగ. ప్రపంచానికి యోగాను బోధించిన ఘనత భారతదేశానిదే. యోగసాధనతో సంపూర్ణ ఆరోగ్యం సంపాదించవచ్చునని లోకానికి చాటారు ఎందరో. పతంజలి మహర్షి ప్రతిపాదించిన లక్షకు పైగా యోగసూత్రాలను తరువాత ఎందరో సంక్షిప్తం చేస్తూ, నవీన సమాజానికి తగిన యోగాభ్యాసాలను, ధ్యాన మార్గాలనూ సూచించారు. వీటిని తు.చ. తప్పక పాటించిన వారి తీరే మారిపోతుందని పెద్దల మాట! మన సినిమా రంగంలో యోగసాధనతోనే…