మేషం : వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కొంటారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉద్యోగస్తులు అధికారులను మెప్పించడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. శారీరక శ్రమ, మానసికాందోళన వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితలవుతారు. వృషభం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలోను, అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. రావలసిన…