మేషం : ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబీకుల మధ్య మనస్పర్థలు వస్తాయి. రావలసిన ధనం చేతికి అందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరుతుంది. మీ నైపుణ్యతకు, సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. వృషభం : పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ముఖ్యం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే…