భారతీయ సినిమా రంగంలో పాన్-ఇండియా స్థాయిలో తనదైన ముద్ర వేసిన హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి సరికొత్త యానిమేటెడ్ ఫ్రాంచైజీ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ (MCU)ని ప్రారంభించింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో భాగంగా మొదటి చిత్రం ‘మహావతార్ నరసింహ’ 2025 జూలై 25న ఐదు భారతీయ భాషలలో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం) అత్యాధునిక 3D ఫార్మాట్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ చిత్రాన్ని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయనున్నారు.
Also Read:Srisailam: శ్రీశైలంలో భక్తుల రద్దీ.. ఉచిత స్పర్శదర్శనం నిలుపుదల
‘మహావతార్ నరసింహ’ చిత్రం భగవంతుడు విష్ణువు దశావతారాలలో నాల్గవ అవతారమైన నరసింహుడి పురాణ గాథను అత్యాధునిక యానిమేషన్ టెక్నాలజీతో తెరపైకి తీసుకొస్తోంది. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి వరం కోసం చేసిన ఘోర తపస్సు, అతని అహంకారం, ప్రజలను హింసించడం, అతని కుమారుడు ప్రహ్లాదుడి అచంచలమైన విష్ణు భక్తి, చివరకు ధర్మ సంస్థాపన కోసం విష్ణువు నరసింహావతారంలో దిగివచ్చే కథను ఈ చిత్రం అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అభిమానుల నుంచి అద్భుతమైన స్పందనను రాబట్టింది, గూస్‌బంప్స్ తెప్పించే విజువల్స్, శక్తివంతమైన నేపథ్య సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.