తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలపై కాంగ్రెస్ పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తోంది. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనతో పాటు ఇటీవల జరిగిన పలు అత్యాచార ఘటనలపై టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తోన్నాయి. ప్రభుత్వం వైఫల్యం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తాాజాగా కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాలో ఆయన మీడియాతో మాట్లాడారు. పబ్ కల్చర్ తో…
తెలంగాణ వ్యాప్తంగా జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన సంచలంన కలిగించింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకులకు చెందిన పిల్లలుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ ఘటన రాజకీయంగా కూడా చర్చనీయాంశం అయింది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నాయి. రాజకీయ ప్రోద్భలం ఉండటంతోనే అధికారులు చర్యలు ఆలస్యం అవుతున్నట్లుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బాధితురాలి ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయడంతో ఈ అంశం…
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మొన్నటి వరకు అత్యాచార ఘటనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడితే.. ఎమ్మెల్యే రఘునందర్ రావు మరిన్ని ఆధారాలు బయటపెట్టడం, బాధిత అమ్మాయి విజువల్స్, ఫోటోలను బయటపెడ్డటంతో ఇంకో టర్న్ తీసుకుంది ఈ కేసు. అత్యాచార బాధితురాలి ఫోటోలు, విజువల్స్ ఎలా బయటపెడుతారంటూ.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ పార్టీతో పాటు రఘునందన్ రావుపై ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఈ వివాదంలో రఘునందన్…
జూబ్లీహిల్స్ రొమోనియా బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన కీలకమలుపులు తిరుగుతోంది. అందులో ప్రజాప్రతినిధుల పిల్లలు ఉండటం.. పోలీసులు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. బాలికతో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడంటూ పలు ఫొటోలు, వీడియోలు బయటికి మరింత అలజడికి కారణమవుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఘటనకు సంబంధించిన ఆధారాలను, ఫొటోలను మీడియాకు విడుదల చేస్తూ.. టీఆర్‌ఎస్ సర్కారు, ఎంఐఎంలపై ఆరోపణలు గుప్పించారు. బీజేపీ ప్రతినిధి బృందం…