టీడీపీ తన అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మస్త్రాన్ని బయటికి తీసుకొచ్చే సమయం ఆసన్నమైందనే టాక్ విన్పిస్తోంది. టీడీపీ ఆవిర్భవించి దాదాపు నాలుగు దశాబ్దాలు అవుతోంది. సీనియర్ ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు వరకు టీడీపీ ఎన్నో అటుపోట్లను చూసింది. అధికారంలో ఉండటం ప్రతిపక్షంలోకి వెళ్లడం ఆ పార్టీకి కొత్తమే కాదు. అయినా గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులను టీడీపీ ప్రస్తుతం ఎదుర్కొంటోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే ఆపార్టీ కనుమరుగు అవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.…