మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధనికుడు.. పేదలు మధ్య వ్యత్యాసం పెరిగిపోతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ వల్లనే అదానీ దురాగతాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
మోడీ, అమిత్ షాపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. స్టాక్ మార్కెట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
రాజకీయ ప్రయోజనాల కోసం పారిశ్రామికవేత్తలపై దాడి చేయడం సరైంది కాదన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యాలు రాజకీయంగా సంచలనం అయ్యాయి. అదానీ విషయంలో ప్రతిపక్షాల దూకుడును కొట్టిపారేసిన శరద్ పవార్ వ్యాఖ్య మహారాష్ట్ర రాజకీయ వ్యవస్థలో చిచ్చు రేపింది.