బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి బయలుదేరిన జేపీ నడ్డా సాంకేతిక లోపంతో కర్ణాటకలోని విద్యానగర్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అయ్యారు. మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్‌కు జేపీ నడ్డా చేరుకోవాల్సింది. కానీ విమానంలో సాంకేతిక లోపంతో ఆలస్యంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు.