ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.అధికార ,ప్రతిపక్ష పార్టీ నాయకులూ ఇప్పటికే వారి వారి నియోజకవర్గాలలో ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఊహించని హామీలను ఇచ్చి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఎన్నికలు సమీపిస్తున్నవేళ నామినేషన్స్ పర్వము మొదలవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులకు బీ ఫారంలను అందించి నామినేషన్స్ వేయిస్తున్నారు.ఇప్పటికే దాదాపు అందరు అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి.మరోసారి అధికారమే లక్ష్యంగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు .ప్రతిపక్ష కూటమిని విమర్శిస్తూ…