ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.అధికార ,ప్రతిపక్ష పార్టీ నాయకులూ ఇప్పటికే వారి వారి నియోజకవర్గాలలో ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఊహించని హామీలను ఇచ్చి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఎన్నికలు సమీపిస్తున్నవేళ నామినేషన్స్ పర్వము మొదలవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులకు బీ ఫారంలను అందించి నామినేషన్స్ వేయిస్తున్నారు.ఇప్పటికే దాదాపు అందరు అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి.మరోసారి అధికారమే లక్ష్యంగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు .ప్రతిపక్ష కూటమిని విమర్శిస్తూ ఈ ఐదేళ్లలో జరిగిన మంచిని చూసి ఓటేయ్యండని జగన్ ప్రజలను కోరుతున్నారు .
అలాగే ప్రతిపక్ష కూటమి కూడా ఈ సారి ఎలాగైనా జగన్ ను గద్దె దించి అధికారం చేపట్టాలని భావిస్తుంది.ప్రతి పక్ష నేత నారా చంద్రబాబు నాయుడు భారీగా బహిరంగ సభలు నిర్వహిస్తూ రాష్ట్రంలో సీఎం జగన్ చేసిన మోసాలను,అన్యాయాలను ప్రజలలోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు .దీనితో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది .ఇదిలా ఉంటే నేటితో నామినేషన్స్ ప్రక్రియ ముగియనుండటంతో బుధవారం పెద్ద సంఖ్యలో నామినేషన్స్ దాఖలు చేసారు.టాలీవుడ్ స్టార్ లిరిక్ రైటర్ అయినా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు . అలాగే మరొక కవి శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మంగళగిరి అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసారు .