పెంపుడు మనుషులను పెట్టుకుని బీఆర్ఎస్ వాళ్లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. తీన్మార్ మల్లన్న పై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైల్లోకి పంపిందన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. వందల కోట్లు ఖర్చుపెట్టి ఆరోజు నన్ను ఎమ్మెల్యేగా గెలవకుండా చేయాలని ప్రయత్నం చేశారన్నారు.