యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వి. వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీని తర్వాత సాయి శ్రీనివాస్ ‘స్టూవర్ట్ పురం దొంగ’ మూవీని పట్టాలెక్కించాల్సి ఉంది. ఇదిలా ఉంటే… తెలుగు మూలాలు కలిగిన ప్రముఖ హిందీ హాస్య నటుడు జానీ లివర్ ‘ఛత్రపతి’ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ తన సోషల్ మీడియా…