2025-26 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ మాస్టర్ బ్యాట్స్‌మన్ జో రూట్ మరోసారి సత్తాచాటాడు. సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టులో రూట్ అద్భుత శతకం బాదాడు. మైకేల్ నెసర్ వేసిన బంతికి రెండు పరుగులు తీసి.. సెంచరీ పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో ఇది అతడికి రెండో సెంచరీ కాగా.. టెస్టు క్రికెట్‌లో మొత్తం 41వ సెంచరీ. ఈ క్రమంలో ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ సరసన నిలిచి.. ఆల్‌టైమ్ టెస్టు సెంచరీల జాబితాలో మూడో స్థానాన్ని పంచుకున్నాడు.…