TSPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) రాత పరీక్షలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తన వివరాలు తప్పుగా నమోదు చేశానని.. ఓ అభ్యర్థి ఏకంగా ఓఎంఆర్ షీటునే మింగేశాడు. నిజామాబాద్ జిల్లా బోర్గాం (పీ) ఉన్నత పాఠశాల పరీక్షాకేంద్రంలో జరిగింది.
Jobs: ఇన్‌స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి ఆదాయపు పన్ను శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇంజినీర్లు, డాక్టరేట్ హోల్డర్లతో సహా 12 లక్షలకు పైగా అభ్యర్థులు మధ్యప్రదేశ్‌లో దాదాపు 6,000 పట్వారీ స్థానాలకు దరఖాస్తు చేసుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగం గురించి పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
Verity Job: ‘కోటి విద్యలు కూటికే’అన్నట్లు ఎంత కష్టం చేసినా జానెడు పొట్టనింపుకునేందుకే. దానికోసమే మనిషి తాపత్రయం దాదాపు నేటి సమాజంలో 25ఏళ్లు కష్టపడి చదివి జాబ్ చేసి సంపాదించేదంతూ జీవితాంతం తినడానికే.
ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ బుధవారం 7,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. గత ఏడాది చివరలో కంపెనీకి నాయకత్వం వహించమని తిరిగి అడిగిన తర్వాత సీఈవో బాబ్ ఇగర్ తీసుకున్న మొదటి ప్రధాన నిర్ణయం ఇది.
ఈ నెలలో మేఘాలయ ఎన్నికలకు ముందు, ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధ్యక్షుడు కాన్రాడ్ కె.సంగ్మా శుక్రవారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధిలో ముందుకెళ్తున్నదని చెప్పారు. విస్తీర్ణంలో హైదరాబాద్ కన్నా సింగపూర్ చిన్నగా ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఎన్‌హెచ్‌ఆర్డీ ‘డీకోడ్ ది ఫ్యూచర్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Mountain of cash: ప్రపంచంలోని ప్రతిష్టాత్మక కంపెనీలన్నీ ఆర్థిక మాంద్యం భయంతో వణికిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఖర్చు తగ్గించుకునే చర్యలపై దృష్టి సారించాయి..