Pahalgam Attack: కశ్మీర్ లోయలోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి వెనుక కుట్ర నెమ్మదిగా బయటపడుతోంది. ఉగ్రవాదులతో నాలుగుసార్లు సమావేశమై, వారికి లాజిస్టికల్ మద్దతును అందించి, మొబైల్ ఫోన్ ఛార్జర్‌లను సరఫరా చేసిన ఓ వ్యక్తిని జమ్మూ కశ్మీర్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. నిందితుడి పేరు 26 ఏళ్ల మొహమ్మద్ యూసుఫ్ కటారి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రకారం.. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు సులేమాన్ అలియాస్ ఆసిఫ్, జిబ్రాన్, హంజా…
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత తాజాగా భారత్ ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులను అంతమొందించడానికి భద్రతా దళాలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 100కు పైగా అనుమానిత ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇళ్లల్లో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు చెప్పారు.
జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ జవాను వీరమరణం పొందారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా.. జమ్మూకశ్మీర్ పోలీసులు ఈరోజు ఉదంపూర్‌లోని బసంత్‌గఢ్‌లో సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. ఇరు వైపుల నుంచి భారీ కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ ఉధంపూర్‌లోని డూడులో జరుగుతోంది. భద్రతా దళాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య గత 24 గంటల్లో…