మణిపూర్లో కుకీల హింసాకాండ కొనసాగుతోంది. జిరిబామ్ జిల్లాలో కుకీ ఉగ్రవాదులు సోమవారం (నవంబర్ 11న) భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడి తర్వాత వారు ఆరుగురిని కిడ్నాప్ చేశారు. బోరోబెక్రా పోలీస్ స్టేషన్, దానికి దగ్గరలోని సిఆర్‌పిఎఫ్ పోస్ట్‌పై కుకీల హింసాత్మక దాడి తర్వాత నుంచీ ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కనిపించడం లేదు. వారిని కుకీ ఉగ్రవాదులే ఎత్తుకుపోయారని పోలీసులు భావిస్తున్నారు.
Encounter: నేడు (నవంబర్ 11, 2024) మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో CRPF సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. అందిన సమాచారం ప్రకారం, ఎన్‌కౌంటర్ సమయంలో ఒక CRPF జవాన్ కూడా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. మణిపూర్‌లోని ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో సోమవారం ఉదయం మిలిటెంట్లు సమీప కొండ ప్రాంతాల నుండి అతనిపై కాల్పులు జరపడంతో ఒక…
మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ ఎస్సైని కాల్చి చంపిన ఉదంతం వెలుగు చూసింది. అధికారితో చిన్న వివాదం కారణంగా వాగ్వాదానికి దిగిన కానిస్టేబుల్ ఆవేశంతో తన సర్వీస్ రైఫిల్‌తో పాయింట్ బ్లాక్ రేంజ్‌లో ఎస్సైను కాల్చి చంపాడు. దీంతో కుర్చీలో కూర్చున్న ఎస్సై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.