ఏపీలోని గుంటూరు నగరంలో ఉండే జిన్నాటవర్‌పై నెలరోజులుగా వివాదం నడుస్తోంది. జిన్నాటవర్ పేరు మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా జిన్నాటవర్‌ను కూల్చివేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీంతో అధికారులు జిన్నాటవర్ చుట్టూ రక్షణ వలయం నిర్మించారు. అయితే తాజాగా ఈ వివాదానికి పరిష్కారం దొరికినట్లు కనిపిస్తోంది. స్థానిక అధికారులు జిన్నాటవర్‌కు జాతీయ జెండాలోని రంగులు వేశారు. దీంతో జిన్నాటవర్ జోలికి ఎవరూ రాకుండా తెలివిగా వ్యవహరించారు. Read Also: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ…
ఈ మధ్య గుంటూరులోని జిన్నా టవర్‌పై పెద్ద చర్చే సాగుతోంది.. గుంటూరు నగరంలో ఉన్న చారిత్రాత్మక కట్టడానికి పాకిస్థాన్ జాతిపిత ఐన మహమ్మద్ అలీ జిన్నా పేరు పెట్టారు.. అయితే, భారతీయ జనతా పార్టీ తరచూ దీనిని లేవనెత్తుతోంది.. రిపబ్లిక్ డే సందర్భంగా జిన్నా టవర్‌పై జాతీయ జెండా ఎగరేసేందుకు ‘హిందూ వాహిని’ పిలుపునివ్వడం కూడా రచ్చగా మారింది.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిన్నా టవర్‌పై ప్రభుత్వమే జాతీయ జెండాను ఎగురవేయాలని.. ప్రభుత్వం స్పందించకుంటే హిందూ వాహినితో…
ఏపీలో బీజేపీ స్ట్రాటజీ మారిపోతోంది. ఎప్పటికప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుంటోంది. ఈసారి కొత్త తరహా రాజకీయానికి తెర లేపింది. వివిధ ప్రధాన నగరాల్లో ముఖ్యమైన ప్రాంతాలకు ఉన్న పేర్లను మార్చాలనే డిమాండ్లను తెరపైకి తెస్తోంది. ప్రత్యేకంగా ప్రజాగ్రహ సభ తర్వాత బీజేపీ పంథాలో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. అయితే బీజేపీ ఇదే దూకుడును ప్రదర్శిస్తే.. ముందు ముందు మరిన్ని సెన్సిటీవ్ అంశాలను టచ్ చేయడం ఖాయమనే భావన వ్యక్తమవుతోంది. ఏపీలోని ప్రధానమైన ప్రాంతాలకు ఉన్న పేర్లల్లో కొన్నింటికి…