అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా డబ్బులు వెనుకేసిన రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు.. ఒక్కరేంటి.. చిన్ననుంచి పెద్ద వరకు ఎంతో మందిపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.. అయితే, కొందరు మాత్రం అడ్డంగా బుక్కైన సందర్భాలు ఉన్నాయి.. ఇక, ఎప్పుడో చేసిన తప్పులు.. ఏళ్ల తరబడి వెంటాడి నేతలు కూడా ఉన్నారు.. తాజాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ విద్యాశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీకి మూడేళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ ప్రత్యేక…
జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రతీ దశలో వారు మాకు వెన్నంటే శిబూ సొరేన్ ఉన్నారు.. వారిని కలిసి, ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంది.. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాకు శిబు సోరెన్‌ని కలిపించడం చాలా సంతోషాన్ని కలిగించింది. నేను వారి ఆశీర్వాదం తీసుకున్నాని తెలిపారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, మంచి అభివృద్ధి సాధిస్తున్నందుకు వారు సంతోషం…
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో రాంచీలో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశానికి సరికొత్త దశ, దిశ కోసం ప్రత్నామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కొత్త పంథాలో, కొత్త విధానంలో దేశాన్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి శిబూ సోరెన్‌తో మంచి అనుబంధం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమానికి శిబూ సోరెన్ ఎన్నోసార్లు మద్దతు పలికారని.. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారని కేసీఆర్ గుర్తుచేశారు. ఈరోజు శిబూ…
జార్ఖండ్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. గతంలో గాల్వన్ వాలీ అమర జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామన్న ప్రకటన మేరకు వారికి ఆర్థిక సాయాన్ని అందజేశారు.. అమర సైనికుడు కుందన్ కుమార్ ఓజా భార్య నమ్రత కుమారికి రూ. 10 లక్షల చెక్ అందించిన సీఎం కేసీఆర్… మరో వీర సైనికుడు గణేష్ కుటుంబ సభ్యులకు కూడా రూ. 10 లక్షల చెక్‌ను అందించారు.. రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో కలిసి ఆ కుటుంబాలను పరామర్శించిన…
జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో సమావేశం అయ్యారు.. ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత తదితరులు పాల్గొన్నారు.. ఈ సమావేశంలో ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు, తాజా రాజకీయాలపై చర్చించారు.. ఈ సందర్భంగా హేమంత్ సోరెన్ తండ్రి…
చైనా సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లను ఆదుకునేందుకు, గతంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. అందులో భాగంగా రేపు జార్ఖండ్ పర్యటన చేపట్టనున్నారు కేసీఆర్.. శుక్రవారం ఢిల్లీ నుంచి రాంచీ వెళ్లినున్న ఆయన.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌తో భేటీకానున్నారు.. ఇక, వారి అధికారిక నివాసంలో రూ.10 లక్షల చెక్కులను జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమర జవాన్ల…
జార్ఖండ్‌లో మావోయిస్టులు వరుసగా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. గిరిడి జిల్లా డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వంతెనను మావోయిస్టులు తెల్లవారు జామున పేల్చేశారు. అంతేకాకుండా, జిల్లాలోని ఒక మొబైల్ ఫోన్ టవర్‌ను పేల్చేశారు. మరో టవర్‌కు నిప్పుపెట్టి కలకలం రేపారు. మావోయిస్టుల నేత ప్రశాంత్ బోస్ అరెస్టుకు నిరసనగా మావోలు ప్రస్తుతం రెసిస్టెన్స్ వీక్‌ను పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విధ్వంసాలకు తెగబడుతున్నారు. మావోయిస్టుల చర్యల నేపథ్యంలో వారి కోసం ఆపరేషన్‌ను మరింత ముమ్మరం…
వైద్య రంగంలోకి కొన్ని అద్భుతమైన ఘట్టాలు వెలుగుచూస్తూ ఉంటాయి.. దేనికోసమో తయారు చేసిన మందు.. మరో రోగాన్ని నయం చేస్తుంది.. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాక జుట్టు పీకోవాల్సిన పరిస్థితులు తెచ్చిపెట్టిన సందర్భాలు ఎన్నో.. తాజాగా, అలాంటి ఘటనే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది.. ప్రపంచం వెన్నులో వణుకుపుట్టిన కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు తయారు వేస్తున్న వ్యాక్సినేషన్‌తో.. మంచానికే పరిమితమైన ఓ వ్యక్తి అమాంతం లేచి నిలబడ్డాడు.. నోట మాటలు రాని ఆ…
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు… సామాన్యుల నుంచి ప్రముఖులు, వీఐపీలు, వీవీఐపీలు.. ఇలా ఎవ్వరికీ మినహాయింపు లేదు అనే విధంగా పంజా విసురుతూనే ఉంది.. ఇప్పటికే భారత్‌లో థర్డ్ వేవ్ ప్రారంభం అయిపోయింది.. ఈ సారి సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది కోవిడ్ బారిన పడ్డారు.. తాజాగా, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది.. సీఎం హేమంత్ సోరెన్సతీమణి కల్పనా సోరెన్, ఆయన కుమారులు నితిన్, విశ్వజిత్ సహా మొత్తం…