Brooklyn Shooting: అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం ఉదయం న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్ మాట్లాడుతూ.. క్రౌన్ హైట్స్ ప్రాంతంలో ఉన్న ‘టేస్ట్ ఆఫ్ ది సిటీ లాంజ్’లో తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలిపారు. కాల్పుల్లో మరణించిన ముగ్గురు పురుషులేనని, వారిలో ఇద్దరు (27), (35) ఏళ్ల వయస్సు…