Imran Khan: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూదులకు సన్నిహితుడు కావడం వల్లే ఇమ్రాన్ ఖాన్‌పై ఇస్లామిక్ తీవ్రవాదులు హత్యయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల వజీరాబాద్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై కాల్పులు జరగడం సంచలనం సృష్టించింది. ఇమ్రాన్‌కు ప్రాణహాని తప్పడంతో పీటీఐ పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనను ఇమ్రాన్ మాజీ భార్యలు ఖండించారు.