తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజిల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలైంది. ప్రైవేట్ కాలేజీల్లో 2025-26గానూ ఉన్నత విద్యామండలి ఈ షెడ్యూల్ విడుదల చేయగా.. జూలై 19నుంచి ఈ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. అగస్టు 10 వరకు మేనేజ్‌మెంట్ కోటా సీట్లు భర్తీ చేసుకునే అవకాశం కల్పించారు. ఎప్‌సెట్, సీసీబీ, జోసా షెడ్యూల్‌కు అనుగుణంగా దీనిని రూపొందించారు. అప్లికేషన్లతో పాటు ఇతర వివరాల కోసం అధికార వెబ్‌సైట్ https://tgche.ac.in/ ను సంప్రదించాలని ఉన్నత విద్యామండలి సూచించింది.