BJP: బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా ఆ పార్టీకి షాక్ ఇచ్చాడు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీ చీఫ్ జేపీ నడ్డాను కోరారు. జయంత్ సిన్హా మాజీ కేంద్రమంత్రి పనిచేశారు, హజారీబాగ్‌కి బీజేపీ ఎంపీగా ఉన్నారు. తాను భారత్, ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.