Jaya Prakash Reddy: టాలీవుడ్ కమెడియన్స్ లో చెప్పుకోదగ్గ నటుడు జయప్రకాశ్ రెడ్డి. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఎన్నో మంచి సినిమాలలో నటించి మెప్పించారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
(మే 8న నటుడు జయప్రకాశ్ రెడ్డి జయంతి)విలక్షణమే జయప్రకాశ్ రెడ్డికి సలక్షణం అని చెప్పకతప్పదు. భారీకాయంతోనే నవ్వించారు, కవ్వించారు, జడిపించారు. పలు పాత్రల్లో పరకాయప్రవేశం చేసి మెప్పించారు. దాసరి నారాయణరావు, డి.రామానాయుడు ప్రోత్సాహంతో చిత్రసీమలో బిట్ రోల్స్ తో పరిచయమైన జయప్రకాశ్ రెడ్డి, సురేశ్ ప్రొడక్షన్స్ ‘ప్రేమించుకుందాం…రా’తో మెయిన్ విలన్ గా నటించారు. అందులో రాయలసీమ యాసతో జనాన్ని ఆకట్టుకున్నారు. అదే ఆయనను బాలకృష్ణ వంటి టాప్ స్టార్ నటించిన ‘సమరసింహారెడ్డి’లోనూ మెయిన్ విలన్ గా నటించేలా…