కామెడీ విలన్ గా జయప్రకాశ్ కు జేజేలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(మే 8న నటుడు జయప్రకాశ్ రెడ్డి జయంతి)
విలక్షణమే జయప్రకాశ్ రెడ్డికి సలక్షణం అని చెప్పకతప్పదు. భారీకాయంతోనే నవ్వించారు, కవ్వించారు, జడిపించారు. పలు పాత్రల్లో పరకాయప్రవేశం చేసి మెప్పించారు. దాసరి నారాయణరావు, డి.రామానాయుడు ప్రోత్సాహంతో చిత్రసీమలో బిట్ రోల్స్ తో పరిచయమైన జయప్రకాశ్ రెడ్డి, సురేశ్ ప్రొడక్షన్స్ ‘ప్రేమించుకుందాం…రా’తో మెయిన్ విలన్ గా నటించారు. అందులో రాయలసీమ యాసతో జనాన్ని ఆకట్టుకున్నారు. అదే ఆయనను బాలకృష్ణ వంటి టాప్ స్టార్ నటించిన ‘సమరసింహారెడ్డి’లోనూ మెయిన్ విలన్ గా నటించేలా చేసింది. కొన్ని చిత్రాలలో విలన్ గా భయపెట్టిన జయప్రకాశ్ రెడ్డి, ‘నరసింహనాయుడు’లో కామెడీతోనూ అలరించారు. అప్పటి నుంచీ కామెడీ విలన్ గానూ పలు చిత్రాలలో ప్రత్యక్షమయ్యారు జయప్రకాశ్ రెడ్డి.
పంతులుగా పనిచేసిన జయప్రకాశ్ రెడ్డి, తమ్ముళ్లను చెల్లెళ్ళను పెంచి పెద్ద చేయడంలోనే సంపాదన కరిగిపోయింది. అయితే ఆయనకు ఉన్న నటనాభిలాషనే జయప్రకాశ్ రెడ్డికి తరిగిపోని, చెరిగిపోని గుర్తింపు సంపాదించి పెట్టింది. వందలాది చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించిన జయప్రకాశ్ రెడ్డి, గత సంవత్సరమే కన్నుమూశారు. ఆయన భౌతికంగా లేకపోయినా, జేపీ ధరించిన పాత్రలు బుల్లితెరపై తెలుగువారిని పులకింప చేస్తూనే ఉన్నాయి.
Also Read
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
- Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
- Janmashtami 2026 Fasting Rules: కృష్ణ జన్మాష్టమి 2026.. ఉపవాసం నుంచి నిశీథి పూజ వరకు పూర్తి వివరాలు
- Tags
- Jaya Prakash Reddy
తాజావార్తలు
-
BRS MLAs Arrested: తీవ్ర ఉద్రిక్తత.. హరీష్ రావు, కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అరెస్ట్..
-
Duleep Trophy Final: ఈస్ట్ జోన్ పెద్ద స్కెచ్చే.. 2 రోజులు ఎందుకు బ్యాటింగ్ చేసిందంటే?.. బీసీసీఐ డిక్లరేషన్ రూల్ ఇదే!
-
Explainer: చైనా యువతను AI నిండా ముంచిందా?
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
Epic: ‘కడలి’ ప్రతి అమ్మాయిలోనూ ఉంటుంది.. ఫ్యామిలీ ఆడియన్స్ ని ‘ఎపిక్’ మెప్పిస్తుంది : వైష్ణవి చైతన్య
ట్రెండింగ్
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!