ప్రస్తుతం రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్.’పైనే సినీ అభిమానుల్లో చర్చ సాగుతోంది. దాదాపు 36 ఏళ్ళ తరువాత వచ్చిన అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇదే కావడంతో ఆ చర్చ మరింతగా మురిపిస్తోంది. ఈ మధ్య వచ్చిన మల్టీస్టారర్స్ లో ఓ సీనియర్ స్టార్ తో తరువాతి తరం స్టార్ హీరో నటించారు తప్ప, సమకాలికులు, సమ ఉజ్జీలయిన స్టార్స్ కలసి నటించలేదు. అది రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’తోనే సాధ్యమైంది. ఇందులో నవతరం అగ్రకథానాయకులైన జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్…
(సెప్టెంబర్ 24న ‘ప్రేమమందిరం’కు 40 ఏళ్ళు) నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ లో అనేక చిత్రాలు వెలుగు చూశాయి. వాటిలో అన్నిటికన్నా మిన్నగా నిలచింది ‘ప్రేమాభిషేకం’. ఈ చిత్రం విడుదలైన 1981లోనే అక్కినేని, దాసరి కాంబినేషన్ లో రూపొందిన మరో చిత్రం ‘ప్రేమ మందిరం’. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి.రామానాయుడు నిర్మించడంతో ‘ప్రేమమందిరం’కు మొదటి నుంచీ ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. అప్పటికే ‘ప్రేమాభిషేకం’ జైత్రయాత్ర కొనసాగుతోంది. అక్కినేని అభిమానుల…
టాలీవుడ్ నటుడు సాయిధరమ్ తేజ్ నిన్న రాత్రి స్పోర్ట్స్ బైక్‌పై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడిపోవడంతో తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్ అపస్మారక స్థితిలో వెళ్లారు. ఆ తర్వాత వైద్యానికి స్పందించారు. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సాయి తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న సినీనటులు ఆయన్ను చూడ్డానికి ఆస్పత్రికి చేరుకొంటున్నారు. తాజాగా రాశిఖన్నా, జయప్రద అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. తేజూ ఆరోగ్యంపై అడిగి తెలుసున్నారు. అనంతరం…
(సెప్టెంబర్ 3న ’47 రోజులు’కు 40 ఏళ్ళు పూర్తి) చిరంజీవి, జయప్రద జంటగా నటించిన ’47 రోజులు’ చిత్రం సెప్టెంబర్ 3తో 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించారు. అంతకు ముందు బాలచందర్ తెరకెక్కించిన ‘ఇది కథ కాదు’లోనూ భార్యను హింసించే భర్త పాత్రలో చిరంజీవి నటించారు. అందులో జయసుధ నాయిక. ఇందులో జయప్రద భర్తగా ఆమె 47 రోజులు కాపురం…
అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున బంగార్రాజు – రాముగా ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ని జులైలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య కూడా నటించనున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ జయప్రద కోసం ఓ క్యారెక్టర్ ను డిజైన్…