అపోలో ఆస్పత్రికి రాశిఖన్నా, జయప్రద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నటుడు సాయిధరమ్ తేజ్ నిన్న రాత్రి స్పోర్ట్స్ బైక్‌పై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడిపోవడంతో తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్ అపస్మారక స్థితిలో వెళ్లారు. ఆ తర్వాత వైద్యానికి స్పందించారు. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సాయి తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న సినీనటులు ఆయన్ను చూడ్డానికి ఆస్పత్రికి చేరుకొంటున్నారు. తాజాగా రాశిఖన్నా, జయప్రద అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. తేజూ ఆరోగ్యంపై అడిగి తెలుసున్నారు. అనంతరం కుటుంబసభ్యులతో కాసేపు గడిపారు.
సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ‘సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్సకు స్పందిస్తున్నారు. ఇంటర్నల్‌గా ఎటువంటి గాయాలు లేవు. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. అంతర్గత అవయవాల్లో ఎలాంటి బ్లీడింగ్ లేదు. కాలర్‌బోన్ గాయానికి శస్త్ర చికిత్సను రేపు పరిశీలిస్తాం. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం’ అని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!