జమ్మూ కాశ్మీర్లో జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. లద్దాఖ్ లో నది దాటుతూ యుద్దట్యాంక్ కొట్టుకుపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించగా.. పొరుగున ఉన్న సుక్మా జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని పోలీసు అధికారి శనివారం తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని టేకల్‌గూడెం గ్రామంలో మంగళవారం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు.
త్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు మావోలు దుశ్చర్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత దంతెవాడ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో తమ వాహనం మంటల్లో చిక్కుకోవడంతో నలుగురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భాటా ధురియన్ ప్రాంతానికి సమీపంలో జరిగింది. పిడుగుపాటు కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కాల్పుల కలకలం రేగింది. సెలవుల విషయంలో జవాన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు జవాన్లు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయని తెలుస్తోంది. గాయపడ్డ జవాన్లను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మారాయిగూడెం వద్ద లింగంపల్లి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులో ఘటన చోటుచేసుకుంది. మృతులు బిహార్‌కు చెందిన రాజమణి యాదవ్, డంజి బంగాల్‌కు చెందిన రాజుమండల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది.…