మనిషిగా పుట్టినవారు చావక తప్పదు.. చనిపోయిన తర్వాత మృదదేహాన్ని కాల్చేసి.. ఆ బూడిదను పవిత్ర జలాల్లో కలుపుతారు. ఈ సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది.. కానీ, మనిషి చితాభస్మంతో కోట్లలో సంపాదిస్తున్నారంటే నమ్ముతారా..? అవును మీరు వింటున్నది నిజమే జపాన్ ప్రభుత్వం మనిషి బూడిదతో వందల కోట్లలో సంపాదిస్తుంది.
జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు జపాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చట్టసభ సభ్యులు ఈ ఆలోచనను ఆమోదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
తగ్గినట్టే తగ్గిన కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. ఇప్పటికే టోక్యో వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్‌కు సైతం కరోనా సెగ తగిలింది.. పలువురు క్రీడాకారులు కరోనబారినపడ్డారు.. అయితే, కరోనా కల్లోలం సృష్టించడంతో జపాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది.. క్యాపిటల్ సిటీ టోక్యో సహా ఆరు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది జపాన్.. టోక్యో, సైతమ, చిబ, కనగవ, ఒసాకా, ఒకినవ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ పరిస్ధితిని ప్రకటించినట్టు ప్రధాని సుగ కార్యాలయం వెల్లడించింది.. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని..…