జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో ఓ దుండగుడు కాల్చి చంపాడు. అయితే తాజాగా సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో షింజో అబే పార్టీ లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ(ఎల్డీపీ) విజయం సాధించింది. జపాన్ పార్లమెంట్ ఎగువ సభ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకు గానూ 148 స్థానాలు సాధించింది. షింజో అబే మరణం తరువాత సానుభూతి పవనాల వీయడంతో ఆయన పార్టీ భారీ విజయం సాధించింది.…