గ్రూప్ ఆఫ్ సెవెన్ (జి7) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జపాన్‌కు వెళ్లనున్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధాని తూర్పు ఆసియా దేశాన్ని సందర్శిస్తున్నారు. శక్తివంతమైన సమూహం ప్రస్తుత అధ్యక్షుడిగా జపాన్ జీ7 సమ్మిట్‌ను నిర్వహిస్తోంది.
జపాన్ ప్రధానమంత్రిగా ఫుమియో కిషిదా మళ్లీ ఎన్నికయ్యారు. నిన్న జరిగిన ఓటింగ్‌లో.. ఆయన ప్రధాని పదవి చేపట్టేందుకు పార్లమెంట్ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో కొత్తగా ఎన్నికైన సభ్యులతో కేబినెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఐతే నెల రోజుల క్రితమే ప్రధానిగా ఎన్నికైన కిషిడా.. పార్లమెంట్ దిగువసభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కిషిదా ప్రాతినిధ్యం వహిస్తున్న…లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ..దిగువ సభలో 261 సీట్లు సాధించింది. దీంతో కిషిదా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే…