సింగపూర్ ఓపెన్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అదరగొడుతోంది. శనివారం ఉదయం జరిగిన సెమీఫైనల్‌లో విజయం సాధించి ఆమె ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో జపాన్ ప్లేయర్ సీనా కవాకమీపై 21-15, 21-7 తేడాతో సింధు విజయం సాధించింది. సింధు ఈ మ్యాచ్‌ను కేవలం 32 నిమిషాల్లోనే ముగించింది. దీంతో టైటిల్‌కు ఇంకా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. సూపర్ 500 టోర్నీలో ఫైనల్ చేరడం ఈ ఏడాది పీవీ సింధుకు ఇదే మొదటిసారి. Read…