మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించనున్నారు. జనవరి 8న ప్రధాని మోడీ ఏపీ పర్యటనకు రానున్నారు. రూ. 85 వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
JPC First Meeting: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జమిలి ఎన్నికల బిల్లు అధ్యయనంపై వేసిన జేపీసీ తొలి సమావేశం జనవరి 8వ తేదీన జరగనుంది. ఢిల్లీలోని పార్లమెంట్ అపెక్స్ బిల్డింగ్ లో ఉదయం 11గంటలకు భేటీ కానుంది.
Sambhal Mosque Survey: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లో గల షామీ జమా మసీదు కమిటీకి భారీ ఊరట లభించింది. సంభాల్ మసీద్ వివాదంపై విచారణకు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.