అమిత్ షా నేడు ( గురువారం) రాష్ట్రానికి రాబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ కు ముందు ప్రచారం చేసి వెళ్లిన ఆయన ఫలితాలకు ముందు మరోసారి వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 31వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.
పిఠాపురం ట్రెండింగ్‌లో ఉన్న సెగ్మెంట్.. ప్రచారం ఎంత హోరాహోరీగా జరిగిందో.. పోలింగ్ కూడా అంతే ఆసక్తిగా సాగింది.. ఎన్నికల ఫలితాల ముందు అదికాస్త పీక్స్‌కు చేరుకుంది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికివాళ్లు.. మా తాలుకా అంటే.. మా తాలుకా అని.. బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారు. వాహనాలకు నెంబర్ పేట్లకు బదులు.. మా పిఠాపురం ఎమ్మెల్యే ఫలానా అని.. రేడియంతో స్టిక్కరింగ్ చేయిస్తున్నారు. ఇలా తిరుగుతున్న వాహనాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిఠాపురంలో ఆధిపత్యపోరు ఓ…
విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కు త్వరలో లీగల్ నోటీసులు ఇవ్వనున్నారు. మూర్తి యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్. జవహర్ రెడ్డిపై రెండు రోజులుగా అసత్య, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో త్వరలో కార్పొరేటర్ మూర్తి యాదవ్‌కు లీగల్ నోటీసు జారీ చేయనున్నారు. శనివారం విశాఖపట్నంలో కార్పొరేటర్ మూర్తి యాదవ్ సిఎస్ జవహర్ రెడ్డి వారిపై చేసిన అసత్యమైన, నిరాధార ఆరోపణలు వాస్తవం కాదని ఇప్పటికే ఖండిస్తూ పత్రికా ముఖంగా స్టేట్మెంట్/రిజాయిండర్…
ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని వైసీపీ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పల్నాడులో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో వైసీపీ నాయకులే గొడవలు చేశారు.. టీడీపీ నాయకులు చాలా మంచి వాళ్ళు అనే విధంగా పరిస్థితులను మార్చేస్తున్నారన్నారు.
టీడిపి కుట్ర పూరిత ఆరోపణలు చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. "లోకేశ్ ట్విట్టర్ లో మాపై తప్పుడు పోస్టులు పెడుతున్నాడు. నారాలోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలు, పప్పు లోకేష్ అందుకే అనేది. దేవినేని ఉమా ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేక పోయావు.
ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయన వారణాసి బయలుదేరి వెళ్లారు. ఈ రోజు రాత్రి అక్కడే ఉండి.. రేపు ఉదయం ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా ఓటింగ్ శాతం నమోదు అవుతోంది.. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. క్రమంగా పుంజుకుంది.. ఇక, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది..