విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో వైసీపీ నేతలపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. పవన్ వైసీపీ నాయకులను నిందించడానికి విశాఖ వచ్చారా? అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ ఆస్తి అనుకుంటున్నారా లేక రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అనుకుంటున్నారో పవన్ సమాధానం చెప్పాలి.
32 మంది ప్రాణ త్యాగాల ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది. గత కొన్ని నెలలు గా విశాఖ ఉక్కు కోసం ఉద్యమాల జరుగుతుంటే పవన్ కు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? పవన్ మాటలు విని మోసపోయే ప్రజలు ఈ రాష్ట్రంలో లేరు. అందుకే గాజువాకలో పవన్ ఓడిపోయారు. గాజువాక లో నన్ను ఓడించారు ..నన్ను గెలిపిస్తే పోరాటం చేసేవాన్ని అని అందరి ముందు చెప్పారు. ఎంత కాలం ప్రజలకు సినిమా డైలాగులు చెబుతారు. పవన్ రాకపోయినా ఉక్కు ఉద్యమం నడుస్తుంది. వైసీపీ ముందుండి నడిపిస్తుందన్నారు అమర్నాథ్.
గతంలో ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఉక్కు కార్మికులను కలిశారు. కార్మికులు చెప్పిన విషయాలను అసెంబ్లీలో తీర్మానం చేశారు. పవన్ సభ లో మోదీ కోసం ఒక్క మాట అయిన మాట్లాడారా? పవన్ కు దమ్ము ఉంటే ఢిల్లీ లో స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చెయ్యాలి. పవన్ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు. పవన్ కు స్థిరత్వం లేదన్నారు అమర్నాథ్.
ఇప్పటికి వరకు పవన్ మూడు పార్టీలు మార్చారు. మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలి అని వైసీపీ కోరుతుంది. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించి తొమ్మిది నెలలు అవుతున్న పవన్ ఏం చేస్తున్నారు. తిరుపతి లో బై ఎలెక్షన్లు జరిగితే ఎందుకు బీజేపీ కి మద్దతు తెలిపారు. అప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. గాజువాక ప్రజలు ఓడించారు అనే అక్కసుతో పవన్ ఇలా వ్యవహరిస్తున్నారు.
పవన్ విశాఖ ఉక్కు నష్టాలలో ఉంది అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఉక్కు కార్మికులు ఈ విషయాన్ని గమనించి ఖండించాలి. బీజేపీ అజెండా ను పవన్ బహిరంగ సభ లో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు నష్టాలలో ఉంటే వైసీపీ పరిశ్రమ లాభాలలో ఉంది అని పవన్ అంటున్నారు. అధికార పక్షంలో ,ప్రతిపక్షం లో లేకుండా అధికగా డబ్బులు సంపాదించిన వ్యక్తి పవన్. అందుకే ఆయన ను ప్యాకేజీ స్టార్ అంటారు. సిద్ధాంతం లేని నాయకుడు పవన్ కళ్యాణ్. పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్. వైసీపీ పార్టీని విమర్శించే హక్కు పవన్ కు లేదన్నారు ఎమ్మెల్యే అమర్నాథ్.