ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు తరలించడంపై రాష్ట్రంలో టీడీపీ భగ్గమంటోంది. చంద్రబాబు అరెస్ట్నకు నిరసన టీడీపీ సోమవారం రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. దీంతో తెల్లవారు జాము నుంచే టీడీపీ శ్రేణులు బయటకు వచ్చి తమ నిరసన పాటిస్తున్నారు. మరోవైపు పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రెండేళ్లు జైలుకు వెళ్లిన వ్యక్తి, రిచెస్ట్ సీఎం.. కానీ ఏమి పని చేశాడో తెలియదని విమర్శించారు. హఠాత్తుగా ఆస్తులు పెంచేసుకుని, అక్రమంగా డబ్బులు సంపాదించిన వారంతా రాజ్యాధికారం దక్కించుకున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరినీ నేరగాళ్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేసిన అంశంలో తన మద్దతు ఉంటుందని చెప్పారు.
నేడు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన పీఏసీ సమావేశం కానుంది. ఈ మీటింగ్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరుకానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం జరుగనుంది.
పవన్ కల్యాణ్ వస్తుంటే మీరు ఎందుకు భయపడుతున్నారని నాదెండ్ల ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ వచ్చి మంగళగిరి పార్టీ ఆఫీసులో భవిష్యత్తు కార్యచరణ నిమిత్తం సీనియర్ నాయకులతో సమావేశం నిమిత్తం రానున్నారని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నుండి 3,82,000 మంది విద్యార్థులు డ్రాప్ ఔట్ అయ్యారని తెలిపారు. విద్యార్థుల అంశంలో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని.. దీనికి కారణాలు ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర ప్రధానమైనదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఎవరున్నా.. మంచి నిర్ణయాలను, కార్యక్రమాలను సమర్ధిస్తామన్నారు. కానీ ప్రజాస్వామ్య విరుద్దంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేస్తే ప్రశ్నించకుండా ఎలా ఉంటామన్నారు.