శత్రువులు ఎక్కడో ఉండరు.. మిత్రుల ముసుగులో మన చుట్టూనే తిరుగుతుంటారని తెగ ఫీలై పోతున్నారట ఆ ఎమ్మెల్యే. నమ్మకస్తుల్లా తన చుట్టూ తిరుగుతున్న వాళ్ళే.. ఎప్పటికప్పుడు ప్రత్యర్థులకు సమాచారం చేరవేస్తూ ముందరి కాళ్ళకు బంధాలు వేస్తున్నట్టు బాధపడుతున్నారట. నాకంతా తెలిసిపోయింది.. ఇక మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు?, ఆయన ఏం చేయబోతున్నారు?. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కు కొందరు మిత్ర పక్షం నేతలే పక్కలో బల్లెంలా తయారయ్యారట. తాను ఏం మాట్లాడినా, ఏం…