వారిద్దరూ మిత్రులు కాదు. అలా అని శత్రువులు కారు. ఒకరు అధికారపార్టీ అని చెప్పుకొంటున్న ఎమ్మెల్యే. ఇంకొకరు టీడీపీ నేత. అకస్మాతుగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. దెప్పిపొడుపు మాటలతో తమలోని కళను బయటపెడుతున్నారు. ఆ గిల్లికజ్జాల కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో దూషణతూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని రాజోలు రాజకీయాలు ఒక్కసారిగా వాడీవేడిగా మారిపోయాయి. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మధ్య ఒక్కసారిగా మాటల యుద్ధం మొదలైంది.…
నాడు గెలిపించిన పార్టీలో ఆ ఎమ్మెల్యే నెంబర్ వన్. నేడు ఆయన కొనసాగుతున్న పార్టీలో ఆ ఎమ్మెల్యే నెంబర్ 152. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. నియోజకవర్గంలో గెలిపించిన పార్టీ వాళ్లు వదిలేశారు. పంచన చేరిన పార్టీ వాళ్లు పట్టించుకోవడం మానేశారు. కో- ఆర్డినేటర్లను మార్పించేసిన ఆ ఎమ్మెల్యే… నియోజకవర్గం కేడర్‌ను గెలవలేకపోతున్నారట. వైసీపీ కేడర్ దగ్గర కాలేదా? తూర్పుగోదావరిజిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజకీయాల్లో ఓ డిఫెరెంట్ నేత. అసెంబ్లీలో జనసేన…