మంగళగిరిలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. సమావేశంలో పాల్గొన్న జనసేన పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు మాజీ మంత్రి అవంతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైజాగ్ రుషి కొండ వ్యూ చాలా అద్భుతమైనది. రుషి కొండను కొట్టేస్తుంటే ప్రతిఘటించింది జనసేనే. అవంతి శ్రీనివాస్ ఎర్ర కొండలు తినేస్తున్నాడు.ఈ పాటికే ఒక కొండ తినేసి ఉండుంటాడు. పవన్ చెప్పింది వింటే.. మన అధ్యక్షుణ్ని 2024లో సీఎంగా చూడవచ్చన్నారు నాగబాబు. పవన్ ఎక్కడికైనా వెళితే సమస్య తీరుతుందని నమ్మకం…
మంగళగిరిలో జరుగుతున్న జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికల తేవాలనే ఉద్దేశ్యంతోనే కోనసీమలో కుట్ర పన్నారన్నారు నాదెండ్ల.వచ్చే నెలలో పులివెందులలో పవన్ పర్యటన వుంటుందన్నారు. ప్రభుత్వమే కోనసీమలో కులాల చిచ్చు పెట్టింది.కోనసీమ ఘటనపై ఇప్పటి వరకు సీఎం జగన్ స్పందించ లేదు.కోనసీమలో శాంతి నెలకొనాలనే అప్పీల్ కూడా చేయలేదు.ముందస్తు ఎన్నికలు తేలవాలనే వ్యూహంలో భాగంగానే కోనసీమ…
ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ఏపీలో జనసేన పార్టీ దూకుడు పెంచింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎక్కడికక్కడ నిరసనలు తెలపడంతో పాటు, రాష్ట్ర నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 5న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ సమావేశంలో…