జనగామ కలెక్టరేట్ భవన సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది… కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేతికి కొబ్బరికాయ అందించారు పూజారి.. ఆ వెంటనే.. తన పక్కనే ఉన్న ఎంపీ కోమటిరెడ్డికి కొబ్బరికాయ ఇచ్చిన కేసీఆర్.. కొట్టాల్సిందిగా సూచించారు.. మొదట నిరాకరించినట్టుగానే కనిపించిన ఆయన.. మీరే కొట్టాలని కోరగా.. మరోసారి సీఎం సూచన చేయడంతో.. వెంటనే టెంకాయను కొట్టేశారు కోమటిరెడ్డి..…
ఉద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్.. జనగామ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్రను కొనియాడారు… అందరి కృషివల్లే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందున్న ఆయన.. గతంలో కరెంట్ సమస్య ఉండేదని.. ఆ సమస్య లేకుండా చేశామని గుర్తుచేశారు.. ఇక, ఉద్యోగులు చిన్న చిన్న సమస్యలకు బెంబేలెత్తిపోవద్దని సూచించారు ముఖ్యమంత్రి.. తెలంగాణ ఉద్యమ సమయంలో అండగా నిలిచిన ఉద్యోగులను…
తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఈ నెల 11, 12 తేదీల్లో జనగామ, యాదాద్రి జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఆయా జిల్లాలలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతన భవనాలను నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ సమీకృత భవనాలను ప్రభుత్వం నిర్మించింది. ఈ నేపథ్యంలో…