Pawan Kalyan Meets MLAs in Vizag: విశాఖలో జరుగుతున్న ‘సేనతో సేనాని’ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. పార్టీని బలోపేతం చేయడంలో ఎమ్మెల్యేల బాధ్యత కీలకమని పవన్ స్పష్టం చేశారు. కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదని ఎమ్మెల్యేలకు దిశానిదేశం చేశారు. పార్టీ కార్యకర్తలను, ఇతర నేతలను కలుపుకుని వెళ్లాలని ఎమ్మెల్యేలకు చెప్పారు. పార్టీ నిర్మాణం, కార్యకర్తల అభివృద్ధికి…