Jammu Kashmir: స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాల హెచ్చరికలతో దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థతో పాటు భద్రత బలగాలు క్షణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. కొన్నాళ్ల నుంచి స్తబ్డుగా ఉన్న ఉగ్రవాదులు మరోసారి నాన్ లోకల్స్ ని టార్గెట్ చేశారు. గతంలో కూడా ఇలాగే హిందూ పండిట్లను, స్థానికేతరులపై దాడి చేశారు.