Jammu Kashmir Exit Poll 2024: జమ్మూ కాశ్మీర్‌లో ఇటు బీజేపీ కానీ, అటు ఎన్సీ- కాంగ్రెస్ కూటమి కానీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేవని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. జమ్మూ ప్రాంతంలో బీజేపీ సత్తా చాటుతుంటే, కాశ్మీర్‌లోయలో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి మెజారిటీ సీట్లు సాధిస్తుందని సర్వేలు అంచనా వేశాయి. అయితే, మొత్తం జమ్మూ కాశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాల్లో 46 మ్యాజిక్ ఫిగర్. ఏ కూటమి కూడా మ్యాజిక్ ఫిగర్‌ని సాధించలేవని సర్వేలు చెబుతున్నాయి.
Haryana Exit Poll 2024: లోక్‌సభ ఎన్నికలు -2024 తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్, హర్యానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో అందరి ఆసక్తి ఈ ఎన్నికలపై నెలకొంది. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ హ్యాట్రిక్ ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మొత్తం 90 స్థానాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెబుతోంది. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉంటే 46 మ్యాజిక్ ఫిగర్.…