Jamiat chief: కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫాం సివిల్ కోడ్(UCC))ని తీసుకురావడానికి కసరత్తు ప్రారంభించింది. 2024 ఎన్నికల ముందు యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకు లా కమిషన్ సంప్రదింపులను ప్రారంభించింది. అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ యూనిఫాం సివిల్ కోడ్ పై అత్యున్నత ఇస్లామిక్ సంస్థ అయి జమియల్ చీఫ్ అర్షద్ మదానీ స్పందించారు.