పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం తప్పింది. ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం శివారులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు కట్టలు విరిగిపోవడంతో బస్సు వెనక టైర్లపై ఒరిగిపోయింది బస్. ప్రమాదం సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ బస్సుని పోలవరం కుడికాలువ బ్రిడ్జి వద్ద నిలిపివేశారు డ్రైవర్. ఘోర ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు ప్రయాణికులు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు వున్నట్టు తెలుస్తోంది. ద్వారకాతిరుమల నుండి ఏలూరు వెళుతుండగా…